బెంగుళూరు: సరైన దుస్తులు ధరించకుంటే, యాసిడ్‌తో దాడి(Acid Attack) చేస్తానని ఓ మహిళను ఓ ఉద్యోగి బెదిరించాడు. ఆ కేసులో ఆ ఉద్యోగిని కంపెనీ నుంచి తొలగించారు.ఇతియోస్ కంపెనీలో పనిచేస్తున్న నిఖిత్ శెట్టి అనే వ్యక్తి పై ఆ మహిళ భర్త ఫిర్యాదు చేశాడు. భార్యకు పంపిన బెదిరింపు మెసేజ్‌లను భర్త పోలీసులకు ఫార్వర్డ్ చేశాడు. తన భార్య తనకు నచ్చిన దుస్తులు వేసుకుంటోందని, కానీ ఓ వ్యక్తి తన భార్యపై యాసిడ్ దాడి చేసేందుకు సిద్దం అయ్యాడని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. భార్యకు పంపిన మెసేజ్‌లను అతను పోలీసులకు చూపించాడు. అక్టోబర్ 9వ తేదీన పంపిన మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీసి అన్సర్ అనే వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించాడు. ఇతియోస్ డిజిటల్ సర్వీసెస్ సంస్థలో మహిళలకు రక్షణ లేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని అతను పోలీసుల్ని కోరాడు. నిఖిత్ శెట్టిపై కేసు నమోదు అయినట్లు కంపెనీ వెల్లడించింది.