Viral News | చేతిలో పైసా లేక 1000కి.మీ. నడిచి స్వగ్రామానికి.. ఒడిశా కార్మికుల దయనీయ గాథ
Viral News | కోరాపుట్ (ఒడిశా): పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం బెంగళూరు వెళ్లిన ముగ్గురు కార్మికులు చేతిలో చిల్లిగవ్వ లేక, వెయ్యి కిలోమీటర్లు కాలినడకన ఒడిశాలోని కొరాపుట్‌కు చేరుకున్న హృదయ విదారక సంఘటన ఇది.
Viral News | కోరాపుట్ (ఒడిశా): పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం బెంగళూరు వెళ్లిన ముగ్గురు కార్మికులు చేతిలో చిల్లిగవ్వ లేక, వెయ్యి కిలోమీటర్లు కాలినడకన ఒడిశాలోని కొరాపుట్‌కు చేరుకున్న హృదయ విదారక సంఘటన ఇది.
ఒడిశాలోని కలహండి జిల్లా తింగల్కన్ గ్రామానికి చెందిన బుడు మాజీ, ఖతర్ మాజీ, బికారీ మాజీ ఒక మధ్యవర్తి ద్వారా బెంగళూరులోని ఒక సంస్థలో పనికి కుదిరారు. పని చేయించుకోవడమే తప్ప జీతం అడిగితే చాలు ఆ సంస్థ యజమానులు వీరిని కొట్టేవారు. రెండు నెలలు పనిచేసిన తర్వాత జీతం కోసం నిలదీసిన వీరిని యాజమాన్యం చావగొట్టి బయటకు గెంటేసింది. చేతిలో రూపాయి కూడా లేదు. దీంతో ఈ ముగ్గురూ కేవలం మంచినీళ్ల సీసాలు మాత్రమే పట్టుకుని వెయ్యి కిలోమీటర్ల దూరంలోని తమ ఇంటికి కాలినడకన బయలుదేరారు. వీరి దయనీయ గాథ విన్న పలువురు దారిలో వీరికి సహాయం చేసేవారు. కొందరేమో భోజనం పెట్టించగా, మరికొందరు కొంత దూరం పాటు రవాణా సౌకర్యం కల్పించేవారు. అలా నానా కష్టాలు పడి వారం రోజుల తర్వాత ఒడిశాలోని కోరాపుట్‌కు చేరుకున్నారు. అప్పటికే వీరి ఆరోగ్య పరిస్థితి దారుణంగా మారింది. వీరిని చూసిన కొందరు స్థానికులు భోజనం పెట్టి, కొంత సొమ్ము ఇచ్చి వారి స్వగ్రామాలకు పంపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

