న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యధిక జన సాంద్రత గల నగరాల జాబితాలో టాప్ టెన్‌లో బెంగళూరు ఉంది. ప్రపంచంలోని 33 మెగా సిటీల్లో ఐదు మన దేశంలోనే ఉన్నాయి. చైనాలో నాలుగు మెగా సిటీలు ఉన్నాయి. అత్యధిక జన సాంద్రత గల 50 నగరాల్లో 12 నగరాలు మన దేశంలోనే ఉన్నాయి.
ఒక చదరపు కిలోమీటరుకు దాదాపు 30,000 జనాభాతో ఈ జాబితాలో ముంబై అగ్రస్థానంలో నిలిచింది. చదరపు కి.మీ.కి 20,000 మందికిపైగా జనాభాతో ముంబై, సూరత్, అహ్మదాబాద్, బెంగళూరు టాప్ టెన్‌లో నిలిచాయి.