కోల్కతా, సెప్టెంబర్ 24: కోల్కతాలో దాదాపు 150 ఏండ్ల నుంచి కొనసాగుతున్న ట్రామ్ సేవలు త్వరలో కనుమరుగు కానున్నాయి. మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ వరకు వారసత్వంగా కొనసాగుతున్న ట్రామ్ సర్వీసు మినహా మిగిలిన అన్ని సర్వీసులను త్వరలో నిలిపివేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోల్కతా వీధుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ట్రామ్ ప్రయాణికులు నిశ్చయించుకున్నారు.
అగర్తల: సీఎం మాణిక్ సాహా సమక్షంలో త్రిపురలో దాదాపు 500 మంది మిలిటెంట్లు మంగళవారం లొంగిపోయారు. వీరు నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ గ్రూపులకు చెందిన వారు. సెపాహిజల జిల్లాలోని జంపుయిజలలో జరిగిన కార్యక్రమంలో సీఎం సాహా వీరికి జనజీవన స్రవంతిలోకి స్వాగతం పలికారు. తీవ్రవాదుల లొంగుబాటుతో త్రిపుర పూర్తిగా తీవ్రవాద రహిత రాష్ట్రంగా మారిందని తెలిపారు.