కోల్‌కతా : గుట్కా, పాన్ మసాలాపై నిషేధాన్ని(Gutkha Ban) పశ్చిమ బెంగాల్ సర్కారు మరో ఏడాది పొడిగించింది. పొగాకు లేదా నికోటిన్‌తో తయారు అయ్యే గుట్కా, పాన్ మసాలా లాంటి వాటిని తయారు చేసినా, దాచిపెట్టిన, అమ్మినా నేరంగా పరిగణించనున్నారు. నవంబర్ 7వ తేదీ నుంచి ఈ నిషేధ ఆదేశాలు అమలుకానున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ అక్టోబర్ 24వ తేదీన ఆ ఆదేశాలు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా.. ఈ ఆదేశాలు ఇచ్చినట్లు ప్రభుత్వం చెప్పింది. ఫుడ్ సేఫ్టీ చట్టంలోని సెక్షన్ 30, స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఫుడ్ సేఫ్టీ కమీషనర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.