Suchetana Bhattacharya | లింగ మార్పిడి సర్జరీ ద్వారా.. పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కుమార్తె
Suchetana Bhattacharya | మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, చిన్నప్పటి నుంచి తనను తాను పురుషుడిగా భావిస్తున్నది. ఈ నేపథ్యంలో లింగ మార్పిడి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించింది. దీని కోసం న్యాయ నిఫుణులు, వైద్య నిఫుణుల సలహాలు తీసుకుంటున్నట్లు మీడియాకు చెప్పింది.
కోల్‌కతా: మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, చిన్నప్పటి నుంచి తనను తాను పురుషుడిగా భావిస్తున్నది. ఈ నేపథ్యంలో లింగ మార్పిడి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించింది. దీని కోసం న్యాయ నిఫుణులు, వైద్య నిఫుణుల సలహాలు తీసుకుంటున్నట్లు మీడియాకు చెప్పింది. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య (Suchetana Bhattacharya) లింగ మార్పిడికి సిద్ధమైంది. ఇటీవల ఎల్జిబిటిక్యూ వర్క్‌షాప్‌నకు ఆమె హాజరైంది. దీంతో పుట్టుక నుంచే తాను పురుషుడినన్న ఆమె నమ్మకం మరింత బలపడింది. ఈ నేపథ్యంలో లింగ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా శారీరకంగా కూడా అలాగే ఉండాలనుకుంటున్నానని చెప్పింది. సుచేతన నుంచి సుచేతన్‌గా మారేందుకు సంబంధిత న్యాయ, వైద్య సలహాలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
కాగా, జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాల మారిదిగానే ఈ నిర్ణయాన్ని కూడా తాను సొంతంగా తీసుకున్నట్లు 41 ఏళ్ల సుచేతన తెలిపింది. ఎల్జీబీటీక్యూ ఉద్యమంలో భాగంగానే పురుషుడిగా మారుతున్నట్లు చెప్పింది. అలాగే ట్రాన్స్ మ్యాన్‌గా ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సామాజిక వేధింపులను లింగ మార్పిడి ద్వారా ఆపాలనుకుంటున్నట్లు పేర్కొంది. తాను మానసికంగా పురుషుడినని నమ్ముతున్నానని, ఇకపై శారీరకంగా కూడా అలాగే ఉండాలని నిర్ణయించినట్లు తెలిపింది.
మరోవైపు తల్లిదండ్రులు, లేదా కుటుంబం గుర్తింపు పెద్ద సమస్య కాదని సుచేతన చెప్పింది. అయితే తన తల్లిదండ్రులను ఈ వివాదంలోకి లాగవద్దని మీడియాకు సూచించింది. చినప్పటి నుంచి తన గురించి తెలిసిన తండ్రి, తన నిర్ణయానికి మద్దతిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ విషయంపై రాద్ధాంతం చేయవద్దని మీడియాను ఆమె కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pochampally Srinivas Reddy : దేశ రాజకీయాలను శాసించి తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

