Indo-Canada relations | జస్టిన్ ట్రూడోకు ముందు.. ఆయన తండ్రి హయాంలోనూ కెనడా, భారత్ మధ్య దెబ్బతిన్న సంబంధాలు
Indo-Canada relations | భారత్, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు (Indo-Canada relations ) ఇటీవల మరింత దిగజారాయి. ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అనంతరం భారత్‌పై నిందలు వేశారు. అయితే జస్టిన్ ట్రూడోకు ముందు ఆయన తండ్రి హయాంలోనూ కెనడా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
న్యూఢిల్లీ: భారత్, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు (Indo-Canada relations ) ఇటీవల మరింత దిగజారాయి. ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అనంతరం భారత్‌పై నిందలు వేశారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించారు. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆ దేశ చట్టసభలో పేర్కొన్నారు. అయితే భారత్ దీనిని ఖండించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు దౌత్యాధికారులను బహిష్కరించాయి. అలాగే కెనడా పౌరులకు వీసా జారీని భారత్ నిలిపివేసింది. ఈ చర్యలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా దిగజార్చాయి.
కాగా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తండ్రి పియరీ ఇలియట్ ట్రూడో కూడా ఆ దేశ 15వ ప్రధానిగా ఉన్నారు. 1971 జనవరిలో ఐదు రోజుల పాటు భారత్‌లో ఆయన పర్యటించారు. తాజ్‌మహల్‌ను సందర్శించడంతోపాటు ఒంటెపై షికారు చేశారు. పియరీ ట్రూడో టూర్ ముగిసిన కొంత కాలం తర్వాత భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఖలిస్థానీ అంశంపై మాత్రం కాదు. భారత్ పౌర అణు శక్తి కార్యక్రమానికి అమెరికా, కెనడా సహకరించాయి. కెనడాతో కలిసి నిర్మించిన కెనడా డ్యూటెరియం యురేనియం (CANDU) రియాక్టర్, అణు విద్యుత్ ఉత్పత్తి కోసం యురేనియం వినియోగాన్ని అనుమతించింది.
మరోవైపు పియరీ ట్రూడో పర్యటన తర్వాత మూడేళ్లకు 1974లో పోఖ్రాన్లో అణ్వాయుధాన్ని భారత్ పరీక్షించింది. కెనడాతో కలిసి నిర్మించిన రియాక్టర్‌లోని ప్లూటోనియంను దీని కోసం వినియోగించినట్లు అమెరికా, కెనడా ఆరోపించాయి. సంబంధిత ఒప్పందాలను భారత్ ఉల్లంఘించినట్లు కెనడా మండిపడింది. శాంతియుత అణు పరీక్షగా పేర్కొన్న భారత్ వాదలను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో భారత అణుశక్తి కార్యక్రమానికి మద్దతును పియరీ ట్రూడో నేతృతంలోని కెనడా ప్రభుత్వం ఉపసంహరించింది. అలాగే భారత్‌లోని మరో రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కెనడియన్ అధికారులను వెనక్కి రప్పించింది. అయితే 2010లో జీ 20 సమ్మిట్ కోసం నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కెనడా పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య అణు సహకార ఒప్పందం మళ్లీ కుదిరింది.
కాగా, ఖలిస్థానీ అనుబంధ సంస్థ బబ్బర్ ఖల్సా సభ్యుడు పర్మార్‌కు నాటి కెనడా ప్రధాని, జస్టిన్ ట్రూడో తండ్రి పియర్ ట్రూడో మద్దతిచ్చారు. విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలపై దాడులకు పిలుపునిచ్చిన పర్మార్‌ను అప్పగించాలని భారత్ చేసిన అభ్యర్థనను ఆయన ప్రభుత్వం తిరస్కరించింది. భారత్ పంపిన ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 1985 జూన్ 23న కెనడాలోని టొరంటో నుంచి బ్రిటన్ రాజధాని లండన్‌కు ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం 182 (కనిష్క)లో రెండు సూట్ కేసులలో బాంబులు అమర్చారు. ఖలిస్థాన్ ఉగ్రవాదులు వాటిని పేల్చడంతో ఆ విమానంలో ఉన్న 329 మంది ప్రయాణికులు మరణించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది కెనడియన్లే. కనిష్క బాంబు దాడి కెనడా చరిత్రలో అత్యంత భయంకరమైన ఉగ్రవాద దాడిగా మిగిలిపోయింది.
మరోవైపు కనిష్క బాంబు దాడి సూత్రధారి, పియరీ ట్రూడో మద్దతిచ్చిన పర్మార్, 1992లో పంజాబ్ పోలీసుల చేతిలో హతమయ్యాడు. అయితే ఈ ఏడాది జూన్‌లో కెనడాలోని పలు ప్రాంతాల్లో పర్మార్‌ను గౌరవిస్తూ పోస్టర్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, తన తండ్రి పియరీ ట్రూడో బాటను అనుసరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

