న్యూఢిల్లీ: అహ్మాదాబాద్ విమానం కూలిన(Ahmedabad Plane Crash) ఘటనకు సంబంధించిన రేడార్ డేటాను .. ఫ్లయిట్ రేడార్ 24 రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విహరించే విమానాలకు సంబంధించిన డేటాను ఫ్లయిట్‌రేడార్ 24 ఆటోమెటిక్‌గా రికార్డు చేస్తుంది. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ ప్రధాన కేంద్రంగా ఫ్లయిట్‌రేడార్24 పనిచేస్తుంది. విమానాల రాకపోకలకు సంబంధించిన లైవ్ సమాచారం ఫ్లయిట్‌రేడార్24 వద్ద ఉంటుంది. అహ్మాదాబాద్‌లో కూలిన విమానం రిపోర్టును కూడా ఫ్లయిట్‌రేడార్24 అప్డేట్ చేసింది. ఏడీఎస్-బ, ఎంఎల్ఏటీ, శాటిలైట్, రేడార్ ఆధారంగా డేటాను ప్రజెంట్ చేస్తారు. ఫ్లయిట్‌రేడార్24.కామ్‌లో ఎప్పటికప్పుడు విమాన స్థితిగతులను తెలుసుకోవచ్చు.
ఫ్లయిట్ రేడార్24 డేటా ప్రకారం విమానం చివరిసారిగా 625 అడుగుల ఆల్టిట్యూడ్‌లో డేటాకు చిక్కినట్లు చెబుతున్నారు. ఫ్లయిట్‌రేడార్24 వెబ్సైట్ ఆ విమానానికి చెందిన డేటాను రిలీజ్ చేసింది. టేకాఫ్ తీసుకున్న నిమిషం లోపే ఏటీసీతో విమాన సంబంధాలు తెగిపోయినట్లు ఫ్లయిట్రేడర్ పేర్కొన్నది. ఫ్లయిట్‌రేడార్ 24 ప్రకారం 08:08 యూటీసీ, స్థానికంగా 13:38 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
అహ్మదాబాద్ విమానాశ్రయం సముద్ర మట్టానికి సుమారు 200 అడుగుల ఎత్తులో ఉంటుంది. అయితే విమానం కూలడానికి ముందు అత్యధికంగా 625 అడుగుల ఎత్తులో ఉన్నట్లు ఫ్లయిట్‌రేడార్ పేర్కొన్నది. అయితే ఆ ఎత్తు నుంచి విమానం కిందకు పడిపోయినట్లు తెలుస్తోంది. నిమిషానికి మైనస్ 475 అడుగుల వేగం(వర్టికల్ స్పీడ్)తో విమానం నేలకూలినట్లు ఫ్లయిట్‌రేడార్24 తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నది.
Initial ADS-B data from flight #AI171 shows that the aircraft reached a maximum barometric altitude of 625 feet (airport altitude is about 200 feet) and then it started to descend with an vertical speed of -475 feet per minute. pic.twitter.com/29szCqRcgR
— Flightradar24 (@flightradar24) June 12, 2025