పాట్నా, జూన్ 25: అక్రమాస్తుల కేసులో బీహార్‌కు చెందిన ఓ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నివాసంపై విజిలెన్స్ విభాగం అధికారులు దాడులు చేశారు. పాట్నా సహా నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
బంగారం, వెండి, విలువైన పత్రాలతో పాటు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బును లెక్కించేందుకు అధికారులు చెమటోడ్చారు. కట్టలన్నింటీనీ బెడ్డుపై పరిచి గంటల కొద్దీ లెక్కపెట్టారు. శనివారం రాత్రి వరకు ఈ లెక్కింపు కొనసాగినప్పటికీ పూర్తి లెక్క తేలలేదు.