లక్నో: సెలూన్‌కు వచ్చిన కస్టమర్ ముఖానికి ఒక బార్పర్ మసాజ్ చేశాడు. ఫేషియల్ చేసిన అతడు చేతిలో ఉమ్మి కస్టమర్ ముఖానికి రుద్దాడు. (Barber uses spit to massage customer) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బార్బర్ పరారయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఈ సంఘటన జరిగింది. సెలూన్‌కు ఒక కస్టమర్ వచ్చాడు. బార్బర్ యూసుఫ్ అతడి ముఖానికి క్రీమ్ రాసి మసాజ్ చేశాడు. అయితే కస్టమర్ కళ్లు మూసుకుని ఉండటంతో బార్బర్ అసహ్యకరంగా ప్రవర్తించాడు. తన చేతిలోకి ఉమ్మి దానితో కస్టమర్ ముఖానికి మసాజ్ చేశాడు. అనంతరం యూసుఫ్ నవ్వుతూ థంబ్స్ అప్ ఇచ్చాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కార్యకర్తలు బార్బర్ యూసుఫ్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో యూసుఫ్ పరారయ్యాడు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న యూసుఫ్ కోసం వెతికి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
कन्नौज : सैलून कर्मी का शर्मनाक करतूत
सैलून कर्मी का थूक लगाकर मसाज करते वीडियो हुआ वायरल
ग्राहक की आंख बंद होने का फायदा उठाकर सैलून कर्मी कर रहा गिरी हुई हरकत,आरोपी फरार
तालग्राम क्षेत्र के छिबरामऊ चौराहे का बताया जा रहा वीडियो@kannaujpolice @Uppolice #Kannauj pic.twitter.com/SimwaxEk4x
— News1India (@News1IndiaTweet) August 7, 2024