పోలీసులకు సహకరిస్తున్న ఇద్దరు క్యాడర్లు… చంపేసిన ఉల్ఫా-ఐ
గౌహతి: పోలీసులకు సహకరిస్తున్న ఇద్దరు క్యాడర్లను నిషేధిత యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం -ఇండిపెండెంట్ (ఉల్ఫా-ఐ) చంపేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అస్సాంలోని బార్పేటకు చెందిన ధంజిత్ దాస్, బైహతా చైరాలికి చెందిన సంజీవ్ శర్మ పోలీసుల కోసం గూఢచర్యం చేశారని ఆ తీవ్రవాద సంస్థ ఆరోపించింది. మార్చిలో ఉల్ఫా-ఐ క్యాడర్లో కొత్తగా చేరిన 30 ఏళ్ల ధంజిత్ దాస్ కొత్త క్యాడర్లతో కలిసి పోలీసులకు లొంగిపోయేందుకు ఏప్రిల్ 24న క్యాంప్ నుంచి పారిపోయినట్లు తెలిపింది. మరునాడు అతడ్ని ఉల్ఫా-ఐ పట్టుకున్నదని చెప్పింది. దర్యాప్తులో తన తప్పును అంగీకరించాడని పేర్కొంది. మే 4న ప్రజాకోర్టులో విచారణ జరిపి మరణశిక్ష విధించడంతో మే 7న దానిని అమలు చేసినట్లు వెల్లడించింది.
అలాగే 18 ఏండ్ల సంజీవ్ శర్మ డబ్బుల ఆశతో పోలీసుల సూచనతో మార్చిలో ఉల్ఫా-ఐలో కొత్తగా చేరాడని ఆ తీవ్రవాద సంస్థ తెలిపింది. అనంతరం ఆధునిక సాంకేతిక ద్వారా అంతర్గత సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడని ఆరోపించింది. మే 5న నిర్వహించిన ప్రజాకోర్టులో అతడు తన తప్పును ఒప్పుకున్నాడని తెలిపింది. దీంతో మరణశిక్ష విధించడంతో మే 7న దానిని అమలు చేసినట్లు పేర్కొంది. తమ తప్పును ఒప్పుకున్నట్లుగా వీరిద్దరు మాట్లాడిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
మరోవైపు ఉల్ఫా-ఐ మరణశిక్ష అమలు చేసిన ఇద్దరు క్యాడర్ల కుటుంబ సభ్యులు ఈ విషయం తెలిసి ఆందోళన చెందారు. కాగా, అస్సాం పోలీసులు దీనిపై స్పందించలేదు. అయితే ఈ ఏడాది అస్సాంకు చెందిన 234 మంది తమ ఇళ్లను, ఉద్యోగాలను వీడి ఉల్ఫా-ఐలో చేరినట్లు తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

