Banke Bihari Temple | మధుర బాంకే బిహారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
Banke Bihari Temple | బృందావనంలోని ఠాకూర్ బాంకే బిహారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భారీగా భక్తులు తరలివచ్చి రాధాకృష్ణులను దర్శించుకున్నారు. ఎండలను సైతం లెక్క చేయకుండా వచ్చి క్యూలైన్లలో బారులు తీరారు.
Banke Bihari Temple | బృందావనంలోని ఠాకూర్ బాంకే బిహారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భారీగా భక్తులు తరలివచ్చి రాధాకృష్ణులను దర్శించుకున్నారు. ఎండలను సైతం లెక్క చేయకుండా వచ్చి క్యూలైన్లలో బారులు తీరారు. ఎక్కడ చూసినా ఆలయ దారులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 500 మీటర్ల వరకు భక్తులు క్యూకట్టారు. ఎండలో వృద్ధులు, మహిళా భక్తులు రద్దీతో ఇబ్బందులకు గురయ్యారు.
విద్యాపీఠ్ చౌరస్తా నుంచి బాంకే బిహారీ మందిర్ చేరుకోవడానికి గంటకుపైగా పట్టింది. ఆలయం కూడా భక్తుల రద్దీతో నిండిపోయింది. వివిధ ప్రాంతాల్లో మోహరించిన పోలీసులు క్యూలైన్లను క్రమబద్దీకరించారు. భారీగా భక్తులు తరలిరావడంతో వారిని అదుపు చేయడం కష్టంగా మారింది. పోలీసులు, ఆలయ సెక్యూరిటీ గార్డులు సైతం ఎండ, ఉక్కపోతతో తడిసిపోయారు. అయితే, ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తుండడంతో ఆలయ నిర్వాహకులు మార్గదర్శకాలు జారీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు రద్దీ సమయాల్లో ఆలయానికి రావొద్దని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

