కోల్‌కతా: దేశంలో అక్రమంగా నివాసముంటున్న బంగ్లాదేశీ మోడల్‌ను (Bangladeshi Model) కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాలోని బారిసల్‌కు చెందిన శాంతా పాల్ (Shanta Pal) అనే 28 ఏండ్ల యువతి కోల్‌కతాలోని జాదవ్‌పూర్ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందించింది. దీంతో ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై దాడిచేసిన అధికారులు శాంతా పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తనిఖీలు చేయగా ఆమె వద్ద వేర్వేరు అడ్రస్‌లతో రెండు నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు కూడా ఉన్నట్లు తేలింది. అదేవిధంగా ఆమె పేరుపై బంగ్లాదేశీ పాస్‌పోర్టులు చాలా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వాటన్నింటిని సీజ్ చేశారు. దీంతోపాటు బంగ్లాదేశ్‌కు చెందిన రెజెంట్ ఎయిర్వేస్లో ఉద్యోగిగా పేర్కొంటు ఆమె పేరుతో ఉన్న ఐడీ కార్డును, ఢాకాలో సెకండరీ విద్య అభ్యసిస్టున్నట్లు జారీచేసిన అడ్మిట్ కార్డును స్వాధీనం చేసుకున్నారు.
ఆమె 2024 చివరి నుంచి అక్కడ ఉంటుందని జాయింట్ కమిషనర్ (క్రైమ్) రూపేశ్ కుమార్ తెలిపారు. ఓ వ్యక్తితో కలిసి అక్కడి వచ్చిందని చెప్పారు. భారత్‌లో ఉండటానికి చెల్లుబాటు అయ్యే వీసాను చూపించలేదని వెల్లడించారు. కోల్‌కతా, బుద్వాన్ అడ్రస్‌లతో ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు ఎలా పొందిందనే విషయమై ఆమెనుప ప్రశ్నిస్తున్నామని తెలిపారు. అయితే విచారణకు సహకరించడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులు ఎలా ఇచ్చారనే విషయమై యూఏడీఏఐకి, ఓటరు, రేషన్ కార్డుల విషయమై ఎన్నికల కమిషన్, బెంగాల్ ఆహార మంత్రిత్వ శాఖకు లేఖలు రాశామన్నారు.
కాగా, విశ్వసనీయ సమాచారం మేరకు శాంతా పాల్ బంగ్లాదేశ్‌లో పలు సినిమాల్లో నటించినట్లు తెలుస్తున్నది. అదేవిధంగా టీవీ చానల్స్, పలు కార్యక్రమాలకు యాంకర్‌గా, పలు అందాల పోటీల్లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.