Heart Band-Aid | న్యూఢిల్లీ: గుండె, ఇతర శరీర భాగాలకు చికిత్స చేయడానికి బ్యాండేజీలు రాబోతున్నాయి. ఆయా భాగాల కణజాలాలతో కలిసిపోయి పనిచేసే ఓ కొత్త రకం పదార్థం అందుబాటులోకి రాబోతున్నది. త్రీడీ ప్రింటింగ్ కోసం ఈ పదార్థం ఉపయోగపడుతుంది. ఇది మానవ కణజాలానికి ఉండే బలం, కావాల్సిన విధంగా సాగే గుణం కలిగి ఉంటుంది.
కొలరాడో, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఈ నూతన త్రీడీ ప్రింట్ పద్ధతిని అభివృద్ధి చేశారు. దీనిని కంటిన్యుయస్ క్యూరింగ్ ఆఫ్టర్ లైట్ ఎక్స్పోజర్ ఎయిడెడ్ బై రిడాక్స్ ఇనీషియేషన్ అని అంటారు. దీని ద్వారా ఔషధాలతో కూడిన గుండె బ్యాండేజీలు, కార్టిలేజ్ ప్యాచెస్, సూదులు లేకుండా గాయాన్ని మూయగలిగే వైద్య పరికరాలను తయారుచేయొచ్చని పరిశోధకులు చెప్తున్నారు.