న్యూఢిల్లీ, అక్టోబర్ 17: సిక్కు మత సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ కొంతమంది సిక్కులు బీచ్‌లు, రిసార్టులలో డెస్టినేషన్ వివాహాలు చేసుకుంటున్నారని, వీటిపై నిషేధం విధిస్తున్నట్టు అకాల్ తఖ్త్ సోమవారం పేర్కొన్నది. ఈ ప్రదేశాల్లో కొందరు సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్‌లను ఏర్పాటు చేసి వివాహాలు నిర్వహిస్తున్నారని, అలాంటి ప్రదేశాల్లో వాటిని ఏర్పాటు చేయడంపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. అకాల్ తఖ్త్ చీఫ్ జ్ఞాని రఘ్బీర్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన ఐదుగురు మతపెద్దల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.