న్యూఢిల్లీ: కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పటాకుల వాడకం, తయారీ, అమ్మకాల్ని నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ‘గత ఐదారేండ్లుగా ఢిల్లీలో గాలి నాణ్యత కాస్త మెరుగుపడింది. దీనిని మరింతగా పెంచేందుకు ఈ ఏడాది శీతాకాలంలోనూ పటాకుల నిల్వ, అమ్మకాలపై నిషేధం విధిస్తున్నాం’ అని మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి ఆరు నెలల వరకు జైలు శిక్ష, రూ.200 జరిమానా విధిస్తామని గత ఏడాది ఆప్ సర్కార్ ప్రకటించింది.