కోల్కతా, మే 27 : పశ్చిమ బెంగాల్లోని బదురియాలో బుధవారం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ కార్యాలయం సమీపంలో భూగర్భంలో పాతిపెట్టిన రూ. 500 నోట్ల కట్టలతో నిండిన సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వ సహాయ సామగ్రి దుర్వినియోగం, అక్రమ ఆస్తులకు సంబంధించిన ఆరోపణల కేసులో టీఎంసీ సీనియర్ నాయకుడు, బదురియా మున్సిపల్ చైర్మన్ దీపాంకర్ భట్టాచార్యను అరెస్టు చేసిన అనంతరం జరిపిన సోదాల్లో ఈ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
టీఎంసీ కార్యాలయం సమీపంలో అధికారులు ఆ ప్రాంగణం సమీపంలో తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల సమయంలో రూ. 500 కరెన్సీ నోట్ల కట్టలతో నిండిన నాలుగు పెద్ద సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు కోట్లలో ఉండవచ్చని అధికారులు చెప్పారు.