డెహ్రాడూన్ : బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయంలో విరాళాల అక్రమాలపై కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు సభ్యులతో కూడిన టీమ్ విచారణ ప్రారంభించిన రెండోరోజే ఆలయ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. విరాళాల అక్రమాలు జరిగినట్టు పలు ఆధారాలు లభించడంతో కమిటీలో ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రమోద్ నౌటియాల్ను సస్పెండ్ చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేదీ తెలిపారు.
ద్వివేదీ మాట్లాడుతూ.. ఎవరైనా తప్పు చేసినట్టు విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కమిటీ 15 రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వనుంది. ఆలయ విరాళాల్లో అక్రమాలు జరిగాయని సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో విచారణ కోసం ఆలయ కమిటీ నలుగురు సభ్యుల కమిషన్ వేసింది.