సిటీబ్యూరో: యూట్యూబ్‌లో చూసి వైన్‌ను తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి డీటీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆంటోనీ పీటర్(60) వైన్ తయారు చేసే విధానాన్ని యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాడు. రక రకాల వైన్లను 750 ఎంఎల్ బాటిల్లో నింపి రూ.300 చొప్పున అమ్ముతున్నాడు. మలాజిగిరి డీటీఎఫ్ పోలీసులు నిందితుడు ఆంటోనీ పీటర్‌ను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.1.50 లక్షల విలువ చేసే 377.7 లీటర్ల వైన్‌ను, 502 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.