Baby resembling God Ganesha | మూతికి తొండంతో జన్మించిన శిశువు.. గణేషుని పోలిక అంటున్న జనం
Baby resembling God Ganesha | గణేశుడిని పోలినట్టుగా ఉన్న శిశువుకు ఒక మహిళ జన్మనిచ్చింది. ముఖం వద్ద తొండం మాదిరిగా ఉన్న ఆ బాబును చూసి వైద్యులు, సిబ్బంది, స్థానికులు ఆశ్చర్యపోయారు (Baby resembling God Ganesha). అయితే 20 నిమిషాల తర్వాత ఆ శిశువు మరణించాడు.
జైపూర్: గణేశుడిని పోలినట్టుగా ఉన్న శిశువుకు ఒక మహిళ జన్మనిచ్చింది. ముఖం వద్ద తొండం మాదిరిగా ఉన్న ఆ బాబును చూసి వైద్యులు, సిబ్బంది, స్థానికులు ఆశ్చర్యపోయారు (Baby resembling God Ganesha). అయితే 20 నిమిషాల తర్వాత ఆ శిశువు మరణించాడు. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అల్వార్ జిల్లాకు చెందిన ఒక మహిళ జూలై 31న రాత్రి 9.30 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువు ముఖం వద్ద బుల్లి వినాయకుడి మాదిరిగా తొండం వంటిది ఉన్నది. దీంతో ఈ వింత బాలుడ్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. అయితే 20 నిమిషాల తర్వాత ఆ పసి బాబు చనిపోయాడు.
కాగా, జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి అసాధారణ రూపురేఖలున్న శిశువులు జన్మిస్తారని దౌసా జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) డాక్టర్ శివరామ్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో గర్భిణీలు క్రమం తప్పకుండా మెడికల్ చెకప్‌లు చేయించుకోవాలని సూచించారు. గర్భిణీలను పరీక్షించేందుకు అధునాతన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

