Babul Supriyo to leave politics : రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: బాబుల్ సుప్రియో
Babul Supriyo to leave politics : రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, పశ్చిమ బెంగాల్ బీజేపీ సీనియర్ నేత బాబుల్ సుప్రియో వెల్లడించారు. అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు

న్యూఢిల్లీ : రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, పశ్చిమ బెంగాల్ బీజేపీ సీనియర్ నేత బాబుల్ సుప్రియో (Babul Supriyo to leave politics) వెల్లడించారు. అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. శనివారం కోల్‌కతాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన బాధను వెల్లగక్కారు. 2014 నుంచి నరేంద్ర మోదీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న బాబుల్ సుప్రియోను ఇటీవలి మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలో భాగంగా పర్యావరణ శాఖ సహాయ మంత్రి పదవి నుంచి తొలగించారు. దాంతో ఆప్పటి నుంచి బాబుల్ సుప్రియో బాధతో ఉన్నాడు.
‘వెళ్లిపోతున్నాను.. అల్విదా… నా తల్లిదండ్రులు, భార్య, స్నేహితులతో మాట్లాడాను. అందరి సలహా విన్న తర్వాత రాజకీయాల నుంచి వెళ్లిపోతున్నానని చెప్తున్నాను. నేను ఏ ఇతర పార్టీకి.. టీఎంసీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం)కు వెళ్లడం లేదు. ఎవరూ నన్ను తమ పార్టీలో చేరాలని ఆహ్వానించలేదని నేను ధ్రువీకరిస్తున్నాను. నేను ఎక్కడికీ వెళ్ళను. నేను ఒక జట్టు ఆటగాడిని. ఎల్లప్పుడూ అదే జట్టుకు మద్దతు ఇస్తూ ఉంటాను. అదే మోహన్ బగాన్. అలాగే, ఒకే పార్టీ బీజేపీతో ఉంటాను. బయల్దేరుతున్నాను’ అని సుప్రియో ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపారు.
‘నేను చాలా రోజులు రాజకీయాల్లో ఉన్నాను. కొందరికి సహాయం చేశాను. మరికొందరిని నిరాశపరిచాను. అది ఎవరో ప్రజలే నిర్ణయించుకోవాలి. రాజకీయాల్లో పాలుపంచుకోకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేయొచ్చు’ అని పోస్ట్‌లో రాశారు. కాగా, కేంద్ర క్యాబినెట్ నుంచి తనను తొలగించడం పట్ల బాధను వ్యక్తపరిచిన బాబుల్ సుప్రియో.. ఎలాంటి అవినీతి మరక లేకుండా బయటకు వెళ్తునందుకు సంతోషంగా ఉన్నదని ఈ నెలారంభంలో తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇవి తింటే డయాబెటీస్ రాదంటా..! అవేంటంటే..?
కొడుకు ఫస్ట్ బర్త్‌డే.. విషెస్ చెప్పిన హార్దిక్, నటాషా
అమ్మకు ప్రేమతో.. తల్లితో అనుష్క శెట్టి
పద్మశ్రీ అవార్డుకు వైజాగ్ కళాకారుడు నామినేట్
వాట్సాప్‌పై కేసు పెట్టిన రష్యా.. ఎందుకంటే..?
45 నిమిషాలపాటు నియంత్రణ కోల్పోయిన ఐఎస్ఎస్
టర్కీ అడవిలో దావానలం.. 20 గ్రామాలు తరలింపు
వైద్యరంగంలో సంచలనం.. తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు
చరిత్రలో ఈరోజు.. మొబైల్ ఫోన్లకు 26 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

