Baba Siddique | బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో సిద్ధిఖీ తనయుడు.. పోలీసులకు తెలిపిన షూటర్లు..!
Baba Siddique | ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ శనివారం రాత్రి దారుణ హత్యకు (Baba Siddique Murder) గురైన విషయం తెలిసిందే. అయితే, బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్ (Hit List)లో సిద్ధిఖీ తనయుడు, ఎమ్మెల్యే జీశాన్ సిద్ధిఖీ (Zeeshan Siddique) కూడా ఉన్నట్లు తెలిసింది.
Baba Siddique | ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ శనివారం రాత్రి దారుణ హత్యకు (Baba Siddique Murder) గురైన విషయం తెలిసిందే. సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. అయితే, బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్ (Hit List)లో సిద్ధిఖీ తనయుడు, ఎమ్మెల్యే జీశాన్ సిద్ధిఖీ (Zeeshan Siddique) కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపిన షూటర్లు (Shooters) విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తండ్రీ కొడుకుల్ని చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi gang) వద్ద కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు షూటర్లు చెప్పినట్లు సదరు వర్గాలు తెలిపాయి. హత్య జరిగిన ప్రదేశంలో తండ్రీ కొడుకులిద్దరూ ఉంటారని.. ఒకేసారి పని అయిపోతుందని షూటర్లు భావించారు. ఒకవేళ ఇద్దరిపై కాల్పులు జరిపే అవకాశం రాకపోతే.. ముందుగా ఎవరు కనిపిస్తే వారిని హతమార్చాల్సిందిగా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి షూటర్లకు ఆదేశాలు వచ్చినట్లు సదరు వర్గాలు తెలిపాయి.
సిద్ధిఖీ దారుణ హత్య
ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, బాంద్రా మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. శనివారం ముంబయి బాంద్రాలోని ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీశాన్ సిద్ధిఖీ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. దసరా సందర్భంగా కార్యాలయం బయట కొందరు టపాసులు కాలుస్తుండగా ముఖానికి గుడ్డలు కట్టుకుని బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండుగులు తుపాకులతో కాల్పులు జరిపారు. గుండెకు తూటా తగలడంతో గాయపడిన సిద్ధిఖీని హూటాహుటిన లీలావతి దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
వారు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వారిగా విచారణలో తేలింది. సిద్ధిఖీని చంపేందుకు ఒకొ నిందితుడికి లారెన్స్ గ్యాంగ్ రూ. 50 వేలు అడ్వాన్స్ ఇచ్చిందని, అలాగే మారణాయుధాలు సైతం సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. బాబా సిద్ధిఖీకి 15 రోజుల క్రితమే ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
హత్య మేమే చేశాం: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
సిద్ధిఖీని తామే హత్య చేసినట్టు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. తమకు వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదని, అయితే ఎవరైతే గ్యాంగ్‌స్టర్ దావుద్ ఇబ్రహీంతో సంబంధాలు పెట్టుకుంటారో, ఎవరైతే సల్మాన్ ఖాన్‌కు సహాయం చేస్తారో వారి ఖాతాలను సరి చేస్తామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా భావిస్తున్న శుభం రామేశ్వర్ లంకర్ ఫేస్బుక్లో హెచ్చరించాడు. బాబా సిద్ధిఖీ హత్యకు కొన్ని నెలల నుంచే నిందితులు రెకీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే గ్యాంగ్ 2024 ఏప్రిల్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపింది. తమ ఆరాధ్య జంతువు కృష్ణ జింకను సల్మాన్ చంపడంతో వారు దాడి చేశారు. సిద్ధిఖీ హత్యతో సల్మాన్ ఇంటి వద్ద మరోసారి భారీగా భద్రత పెంచారు.
Also Read..
Salman Khan | బాబా సిద్ధిఖీ హత్య.. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రత పెంపు
Air Pollution | దీపావళికి ముందే.. ఢిల్లీలో పడిపోయిన గాలి నాణ్యత
Cracker Ban | వాయు కాలుష్యం.. ఈసారి కూడా బాణా సంచాపై నిషేధం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

