Ayodhya Deepotsav : దీపావళి పండుగ వేళ శ్రీరాముడు కొలువైన అయోధ్యలో దీపోత్సవం కన్నులపండువగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు 26 లక్షలకు పైగా దివ్వెలను వెలిగించారు. ఇంత భారీ మొత్తంలో దీపాలను వెలిగించడం భారీ జనసందోహంతో హారతి కార్యక్రమం నిర్వహించడం ద్వారా రెండు ప్రపంచ రికార్డులు ఈ పవిత్ర నగరానికి దాసోహమయ్యాయి. భక్తిపారవశ్యంతో చేపట్టిన ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఫిదా అయిపోయారు. మెగా దీపోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాథ్ (Yogi Adityanath)కు గిన్నిస్ సర్టిఫికెట్లు అందజేశారు.
చోటీ దివాలీని పురస్కరించుకొని.. సరయూ నది ఒడ్డున ఒడిశా పర్యాటక శాఖ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా దీపోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా 2,6,17,215 దీపాలను వెలిగించారు. అంతేకాదు హారతి కార్యక్రమంలో భక్తులు అశేషంగా పాల్గొనడం కూడా గిన్నిస్ బుక్ రికార్డులో నమోదైంది.
#UttarPradesh: Ayodhya is witnessing a vibrant fusion of spirituality, culture, and tradition on the 9th #Deepotsav.
CM @myogiadityanath receives the certificates of 2 new Guinness World Records created during the Deepotsav celebrations in Ayodhya
Guinness World Record… pic.twitter.com/mklW0nqNp1
— All India Radio News (@airnewsalerts) October 19, 2025
అనంతరం రాముడు నిర్వాణం పొందినట్టుగా చరిత్ర చెబుతున్న రామ్ కీ పైడీ వద్ద ‘లేజర్ లైట్ షో’ నిర్వహించారు. దీపాల వెలుగులకు, లేజర్ కిరణాల జిలుగులు తోడవ్వడంతో సరయూ నదీ తీరమంతా.. వెలుగుల తోరణంలా జిగేల్మంది. అంతేకాదు ‘రామ్లీలా’ నాటకం ప్రదర్శన కూడా ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది.
#Ayodhya Ji’s divine glow 🪔
26 lakh diyas, Guinness World Record, eco-friendly festivities, logistics, tourism arrangements & global diya movement. Celebrating #Deepotsav with pride, unity & innovation under the leadership of @myogiadityanath ji.
From millions of diyas to… pic.twitter.com/cj1hFkVY0f
— Amitabh Chaudhary (@MithilaWaala) October 19, 2025