ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో కన్నుల పండువగా సాగిన దీపావళి దీపోత్సవ్ గిన్నిస్ రికార్డును సృష్టించింది. సుమారు 22,23,000 మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించి ఈ సరికొత్త ఘనతను సాధించారు. ఈ కార్యక్రమానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు.
రామాలయం నిర్మితమవుతున్న నేపథ్యంలో అయోధ్యలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.