కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో మంగళవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళలు, యువతులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలను ఒకచోటకు చేర్చి.. బతుకమ్మ పాటలు పాడారు. ఆ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. అనంతరం మంగళ హారతులతో వెళ్లి బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేర్చారు.
ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండాలని, జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ధన సంపత్తిని కల్పించాలని గౌరమ్మను మొక్కుకున్నారు. అదేవిధంగా స్థానిక శ్రీ విట్టలేశ్వరాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ వేడుకల్లో రెడ్డి శెట్టి సునీత, ప్రణీత, స్వప్న, సురేఖ, ప్రణాళి, జ్యోతి ఆర్యవైశ్య మహిళలు, చిన్నారులు పలువురు పాల్గొన్నారు.