న్యూఢిల్లీ: ఏప్రిల్ 29న బెంగాల్ రెండో దశ ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెలుబడ్డాయి. ఆ పోల్స్‌లో టీవీకేకు 98 నుంచి 120 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా(Axis My India) అంచనా వేసింది. దీనిపై ఓ ఎన్డీటీవీ ఓ రిపోర్టును పబ్లిష్ చేసింది. యాక్సిస్ మై ఇండియా ప్రకారం ఆ ఎగ్జిట్ పోల్స్‌ను రిలీజ్ చేశారు. తమిళనాడులో టీవీకే ప్రభంజనం సృష్టించనున్నట్లు ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొన్నది. యాక్సిస్ మై ఇండియా సంస్థ ఇచ్చిన రిపోర్టుపై నిజానికి ఎవరికీ నమ్మకం లేదు. కానీ ఆ ఎగ్జిట్ పోల్ ఇప్పుడు నిజమైనట్లుగా తోస్తోంది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన హీరో విజయ్ పార్టీ .. యాక్సిస్ మై ఇండియా అంచనా వేసినట్లు సెంచరీ కొట్టింది. డీఎంకే, అన్నాడీఎంకేలకు అనూహ్యమైన షాక్ ఇచ్చింది. కనిష్టంగా 98 స్థానాల్లో టీవీకే విజయం సాధిస్తుందని యాక్సిస్ మై ఇండియా అంచనా వేయడం గమనార్హం.
పీపుల్స్ పల్స్ తన అంచనాలో డీఎంకే 125 నుంచి 145 స్థానాలు వస్తాయని పేర్కొన్నది. ఆక అన్నాడీఎంకే 65 నుంచి 80 స్థానాలు వస్తాయని చెప్పింది. పీపుల్స్ ఇన్సైట్ డీఎంకేకు 120-140 స్థానాలు, అన్నాడీఎంకే 60-70 స్థానాలు వస్తాయని పేర్కొన్నది. ప్రజా పోల్ ప్రకారం డీఎంకేకు 148-168 సీట్లు, అన్నాడీఎంకేకు 61 నుంచి 81 సీట్ల వరకు వస్తాయని అంచనా వేశారు. టీవీకేకు గరిష్టంగా 9 స్థానాలు వస్తాయని చెప్పారు. పీ-మార్క్ తన ఎగ్జిట్ పోల్‌లో డీఎంకేకు 125 నుంచి 145, అన్నాడీఎంకేకు 65 నుంచి 86, విజయ్‌కు 16 నుంచి 26 స్థానాలు రావొచ్చు అని చెప్పింది. మాట్రిజ్ పోల్ ప్రకారం డీఎంకేకు 122 నుంచి 132, అన్నాడీఎంకేకు 87 నుంచి 100 స్థానాలు, విజయ్‌కు 10 నుంచి 12 సీట్లు రావొచ్చు అని అంచనా వేశారు. కామాఖ్య అనలటిక్స్ ప్రకారం డీఎంకేకు 78 నుంచి 95, అన్నాడీఎంకే 68 నుంచి 84 , విజయ్‌కి 67 నుంచి 81 సీట్లు వచ్చే ఛాన్సు ఉన్నట్లు చెప్పారు. జేవీసీ ప్రకారం డీఎంకేకు 75 నుంచి 95 స్థానాలు, అన్నాడీఎంకేకు 128 నుంచి 147 స్థానాలు, విజయ్‌కు 8 నుంచి 15 సీట్లు రావొచ్చు అన్నారు.
కానీ యాక్సిస్ మై ఇండియా చేసిన సర్వే దాదాపు నిజమైంది. ఆ సంస్థ ప్రకారం టీవీకే జన ప్రభంజనం సృష్టించింది. విజయ్దుందుబి మోగిస్తున్నారు. యాక్సిస్ మై ఇండియా అంచనా వేసినట్లే విజయ్ పార్టీ చెలరేగిపోతోంది. ప్రస్తుతం ఈసీ వెబ్సైట్ ప్రకారం టీవీకే 107 స్థానాల్లో ఆ పార్టీ లీడింగ్‌లో ఉన్నది. డీఎంకే 61, అన్నాడీఎంకే 49 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
యాక్సిస్ మై ఇండియా సంస్థ .. తొలి కన్జ్యూమర్ డేటా ఇంటెలిజెన్స్ కంపెనీగా రిజిస్టర్ చేసుకున్నది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కరికులమ్‌ను ఆ సంస్థ ఫాలోఅవుతోంది. ఎన్నికల పోలింగ్ సరళికి సంబంధించిన డేటా సేకరణలో 93 శాతం కచ్చితత్వంతో ఉన్నట్లు ఆ సంస్థ తన వెబ్సైట్లో పేర్కొన్నది. యాక్సిస్ మై ఇండియాకు దేశంలోని 700 జిల్లాల్లో నేరుగా యాక్సిస్ ఉన్నది. సుమారు 30 కోట్ల మంది ప్రజలతో ఆ సంస్థ అనుక్షణం టచ్‌లో ఉంటోంది. యునీలివర్, మహేంద్ర అండ్ మహేంద్ర, పీఅండ్‌జీ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, పిరామల్ ఫైనాన్స్, డిస్నీ స్టార్, టాటా మోటార్స్‌తో కలిసి యాక్సిస్ మై ఇండియా పనిచేస్తున్నది. యాక్సిస్ మై అమెరికా బ్రాండ్ నేమ్‌లో అమెరికాలోనూ యాక్సిస్ మై ఇండియా ఇటీవల తన సేవల్ని విస్తరించింది.
Post 10 of 10 – Tamil Nadu – Exit Poll – Overall Seat Share (234 Seats) & Vote Share (%)#TamilNaduelections2026#ExitPoll#AxisMyIndia
@pradeepgupta_ami pic.twitter.com/rlLm6u6Btl— Axis My India (@AxisMyIndia) April 29, 2026
తమిళనాడు ఫలితాలను తాము అంచనా వేసిన సమయంలో చాలా మంది నవ్వుకున్నారని యాక్సిస్ మై ఇండియా ఓనర్ ప్రదీప్ గుప్తా తెలిపారు. ఇది డేటా సైన్స్ విజయం అని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా తమ అంచనాలను ఎవరూ నమ్మలేదని, అంతా ఉట్టిదే అని అన్నారని, రాజకీయ పండితులు, అబ్జర్వర్లు, ఇతర పోలింగ్ ఏజెన్సీలు కూడా విజయ్ గెలుస్తాడంటే నవ్వుకున్నాయన్నారు. ఆ సర్వే ప్రకారం 37 శాతం మంది తమిళ ఓటర్లు విజయ్‌ని సీఎంగా చూడాలనుకున్నారు.