Viral Video | ప్రముఖ నగరాల్లో ట్రాఫిక్ (Traffic) సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన
పనిలేదు. ఒక్కసారి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయామంటే అంతే సంగతులు. గంటల తరబడి అక్కడే చిక్కుకుపోవాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనదారులైతే వాహనాల మధ్యలో దూరి ఈజీగా వెళ్లిపోతుంటారు. అయితే, ఆటో, కారు, బస్సులు మాత్రం ముందు వాహనాలు కదిలే వరకూ వేచి ఉండాల్సిందే.
అయితే, దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఓ ఆటో డ్రైవర్ (Auto Driver) మాత్రం ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు తన మూడు చక్రాల వాహనాన్ని ఏకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి (Foot Over Bridge) ఎక్కించేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆటో డ్రైవర్‌ను 25 ఏళ్ల మున్నాగా గుర్తించారు. ఈ మేరకు అతడిని అరెస్ట్ చేసి ఆటోన సీజ్ చేశారు.
ఢిల్లీలో ట్రాఫిక్ సమస్య తప్పించుకునేందుకు ఏకంగా ఫుట్ఓవర్ బ్రిడ్జ్‌పై ఆటోను నడిపేశాడు ఒక యువకుడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆటో డ్రైవర్‌ను మున్నాగా గుర్తించి స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.#Delhi #Auto #UANow pic.twitter.com/FKlnQg5QeA
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) September 4, 2023
Also Read..
Isro Scientist | కౌంట్‌డౌన్ సమయంలో స్వరం వినిపించే ఇస్రో శాస్త్రవేత్త మృతి
Vivek Ramaswamy | నేను అధ్యక్షుడినైతే.. ట్రంప్‌ను క్షమిస్తా : వివేక్ రామస్వామి
Vikram Lander: మళ్లీ ల్యాండైన విక్రమ్.. 40 సె.మీపైకి లేచి.. 40 సె.మీ దూరంలో దిగిన ల్యాండర్