ముంబై : దయార్ధ్ర హృదయులు అక్కడక్కడా కనిపిస్తుంటారు. వారు ఎదుటివారికి తమకు తోచిన సాయం చేసేందుకు (Viral Video) ఎన్నడూ వెనుకాడరు. పెంపుడు కుక్కను ఆస్పత్రికి తీసుకువచ్చిన మహిళ తిరిగి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా కుక్కకు సీటు ఇచ్చేందుకు ఏ ఆటో డ్రైవర్ అంగీకరించలేదు. ఇక ఓ ఆటో డ్రైవర్ తనకు జంతువులంటే ఇష్టమని చెబుతూ పెంపుడు కుక్క సహా మహిళను వారి ఇంటి వద్ద డ్రాప్ చేసిన ఘటన పలువురిని ఆకట్టుకుంటోంది.
హృదయాన్ని తాకే ఈ వీడియోను ఆస్కార్ అండ్ కర్మ అనే పేజ్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ క్లిప్‌లో పెంపుడు కుక్కను క్లినిక్ నుంచి తీసుకువెళ్లేందుకు ఏ ఒక్క ఆటో డ్రైవర్ అంగీకరించడం లేదని చెబుతుండటం కనిపిస్తుంది. ఇక మరో ఆటో డ్రైవర్ వారిని తన ఆటోలో కూర్చోవాలని చెప్పడమే కాకుండా తనకు జంతువులంటే ఇష్టమని చెబుతాడు.
సూపర్ హీరోలకు రెక్కలు ఉండవు..వారు నిజమైన ప్రజలని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు పది లక్షలు పైగా వ్యూస్ రాగా ఆటో డ్రైవర్ ఎంతో దయకలిగిన వాడని పలువురు యూజర్లు ప్రశంసలు గుప్పించారు. అతడికి ఎంతో కొంత అదనంగా చెల్లించండని మరికొందరు కామెంట్ చేశారు.
Read More