ముంబై: ఆక్సిజన్, రెమ్డెసివిర్ కొరతను బాంబే హైకోర్టు ఔరంగాబాద్ ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది.సుమోటోగా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై సోమవారం విచారణ జరిపింది. దీనిపై ఈ నెల 29లోగా స్పందించాలని ఔరంగాబాద్ బెంచ్ పరిధిలోని అధికారులైన ఔరంగాబాద్ డివిజనకల్ కమిషనర్, ఔరంగాబాద్ పోలీస్ కమిషనర్, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లతోపాటు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించింది. కరోనా సంబంధిత సమస్యలతోపాటు వ్యాక్సిన్ల కొరతపైనా కోర్టు ఆరా తీసింది.