న్యూఢిల్లీ, అక్టోబర్ 14: చంద్రయాన్-3 చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన ఆగస్ట్ 23ను జాతీయ అంతరిక్ష దినంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ‘ఈ చార్రితక ఘట్టాన్ని ఉత్సవంలా జరుపుకోవడానికి ఏటా ఆగస్ట్ 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించింది’ అని అంతరిక్ష శాఖ శనివారం ప్రకటించింది.
రానున్న కాలంలో ఈ చారిత్రక మిషన్ ఫలితాలు మానవాళికి ప్రయోజనం చేకూరుస్తాయని తెలిపింది. దేశ అంతరిక్ష రంగంలో ఆగస్ట్ 23 కీలక మైలురాయిగా గుర్తుండిపోతుందని పేర్కొంది.