Nithyananda | రాముడి ప్రాణప్రతిష్టకు ఆహ్వానం అందింది.. అయోధ్యకు వస్తా: నిత్యానంద
Nithyananda | ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో ఈ నెల 22న జరుగనున్న రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందినట్లు తనను తాను దైవంగా చెప్పుకునే నిత్యానంద (Nithyananda) తెలిపాడు. ఈ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్లు పేర్కొన్నాడు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో ఈ నెల 22న జరుగనున్న రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందినట్లు తనను తాను దైవంగా చెప్పుకునే నిత్యానంద (Nithyananda) తెలిపాడు. ఈ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నాడు. ‘ఈ చారిత్రాత్మకమైన, అసాధారణమైన సంఘటనను మిస్ అవ్వకండి. సాంప్రదాయ ప్రాణ ప్రతిష్ట సమయంలో రాముడు లాంఛనంగా ఆలయంలోని ప్రధాన విగ్రహంలోకి ఆవాహన అవుతాడు. యావత్ ప్రపంచాన్ని కరుణించేందుకు భూమిపైకి వస్తాడు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘లాంఛనంగా ఆహ్వానం అందడంతో హిందూ మతం అత్యున్నత పీఠాధిపతి భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం ఈ గొప్ప కార్యక్రమానికి హాజరుకానున్నారు’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, కర్ణాటకలో ఒక మఠానికి అధిపతి అయిన నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైంది. కారు డ్రైవర్ ఫిర్యాదుతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన నిత్యానంద 2020లో దేశం నుంచి పారిపోయాడు. ఒక దీవిని ‘కైలాస’ దేశంగా ప్రకటించిన ఆయన హిందూ మతానికి సుప్రీం పీఠాధిపతిగా చెప్పుకుంటున్నాడు.
2 More Days Until the Inauguration of Ayodhya Ram Mandir!
Don't miss this historic and extraordinary event! Lord Rama will be formally invoked in the temple's main deity during the traditional Prana Pratishtha and will be landing to grace the entire world!
Having been formally… pic.twitter.com/m4ZhdcgLcm
— KAILASA's SPH NITHYANANDA (@SriNithyananda) January 20, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Attending
- event
- Kailasa
- Nithyananda
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

