గాంధీనగర్: కొవిడ్ మహమ్మారి తర్వాత వర్చువల్ (ఆన్లైన్) సమావేశాలు సాధారణమయ్యాయి. అయితే వీటిలో పాల్గొనే కొందరు దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా జూన్ 20న అలాంటి ఘటన గుజరాత్ హైకోర్ట్ విచారణలో చోటు చేసుకుంది. ఓ కేసు వర్చువల్ విచారణకు కక్షిదారు టాయిలెట్ సీట్‌పై కూర్చొని హాజరయ్యాడు. మొదట అతడు కొంత దూరంలో తాను వర్చువల్ విచారణకు వాడిన ఫోన్‌ను దూరంగా పెట్టినప్పటికీ కొంత సేపటి తర్వాత ఫోన్‌ను దగ్గరగా పట్టుకోవడంతో అతడు టాయిలెట్ సీట్లో కూర్చొన్నట్టు అందులో కనిపించింది.