శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 16:10:39

దేశంలోకి భారీ ఆయుధ అక్ర‌మ ర‌వాణా ప్ర‌య‌త్నం విఫ‌లం..

దేశంలోకి భారీ ఆయుధ అక్ర‌మ ర‌వాణా ప్ర‌య‌త్నం విఫ‌లం..

ఐజ్వాల్ : దేశంలోకి భారీస్థాయిలో ఆయుధ అక్ర‌మ ర‌వాణా ప్ర‌య‌త్నాన్ని బీఎస్ఎఫ్ విఫ‌లం చేసింది. ఈశాన్య రాష్ర్టంలో ఇటీవ‌లి సంవ‌త్స‌రాల్లో ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలు ప‌ట్టుబ‌డ‌టం ఇదే తొలిసారి. మిజోరంలోని వెస్ట్ పైలేంగ్‌లో బీఎస్ఎఫ్ జ‌వాన్లు ముగ్గురు ఆయుధ స్మ‌గ్ల‌ర్ల‌ను అరెస్టు చేశారు. వీరి వ‌ద్ద నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహ‌నాల్లో ర‌హ‌స్యంగా ఆయుధాల‌ను ఉంచి ర‌వాణా చేస్తున్నారు. కొన్ని తిరుగుబాటు గ్రూపులకు ఎకె సిరీస్ రైఫిల్స్‌తో పాటు మందుగుండు సామగ్రిని తీసుకువస్తున్నట్లు దళాల‌కు స‌మాచారం అందింది.  విశ్వ‌స‌నీయ స‌మాచారంతో రైడ్ చేసి ప‌ట్టుకున్న‌ట్లు వెల్ల‌డించారు. దేశ వ్య‌తిరేక శ‌క్తులు భార‌త భూభాగంలోకి ఆయుధాల‌ను అక్ర‌మంగా ర‌వాణా చేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. స్మ‌గ్ల‌ర్ల వ‌ద్ద నుండి 28 ఏకే సిరీస్ రైఫిల్స్‌, ఒక ఏకే-47, ఒక 0.30 ఇంచ్ కార్బైన్‌, 28 మ్యాగ‌జిన్లు, 7894 రౌండ్ల మందుగుండు, రెండు ఖుక్రిలను స్వాధృనం చేసుకున్నారు. logo