అశోక్‌నగర్ (ఎంపీ), మే 19: వృద్ధ దళిత దంపతులను స్తంభానికి కట్టేసి కొట్టడమే కాకుండా వారికి చెప్పుల దండ వేసిన దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్నది. దళిత దంపతుల కుమారుడు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపిస్తూ కొందరు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు ఆదివారం వెల్లడించారు. ‘అశోక్‌నగర్ జిల్లా ముంగవోళి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కిలోరా గ్రామానికి చెందిన దళిత దంపతులు ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చారు. శుక్రవారం 65 ఏండ్ల దళితుడు, 60 ఏండ్ల ఆయన భార్యను కొందరు పోల్‌కు కట్టేసి చావబాదారు. అనంతరం వారికి చెప్పుల దండ వేశారు’ అని పోలీసులు వెల్లడించారు. ఈ దాడి ఘటనలో 10 మంది నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. వీరంతా పరారీలో ఉన్నారని, నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.