Minister Atishi | దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్యపై దీక్ష చేపట్టి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ మంత్రి అతిషి (Minister Atishi ) డిశ్చార్జ్ (discharged) అయ్యారు. రెండు రోజులపాటు చికిత్స తీసుకున్న ఆమె ఇవాళ ఉదయం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. మంత్రిని ఆసుపత్రి నుంచి ఉదయం 10:30 గంటలకు డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు.
ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభాన్ని నివారించాలని కోరుతూ ఈనెల 21న అతిషి నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీకి చెందిన నీటి వాటాను హర్యానా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. హర్యానా నీటిని విడుదల చేసే వరకు ఆమరణ నిరవధిక దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ దీక్ష నేపథ్యంలో నాలుగు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. రక్తంలో షుగర్ స్థాయిలు పడిపోయాయి. దీంతో ఆమెను ఈనెల 25న లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్‌కు (LNJP) తరలించారు. వైద్యులు ఆమెకు ఐసీయూలో చికిత్స అందించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడటంతో రెండు రోజుల చికిత్స అనంతరం ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు.
Also Read..
Electrocution | బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతంతో తల్లీ, కొడుకు మృతి
NEET-UG Paper Leak | నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో ఇద్దరి అరెస్ట్
Hyderabad | పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. బాలికపై కానిస్టేబుల్ లైంగిక దాడి