Tejas Mark 1A Fighter Squadron | రాజస్థాన్ ఎయిర్ బేస్‌లో.. తేజస్ మార్క్ 1ఏ తొలి ఫైటర్ స్క్వాడ్రన్
Tejas Mark 1A Fighter Squadron | స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా అభివృద్ధి చేస్తున్న తేజస్ ఎల్సీఏ మార్క్ 1ఏ తొలి ఫైటర్ స్క్వాడ్రన్‌ను (Tejas Mark 1A Fighter Squadron) రాజస్థాన్‌లో ఏర్పాటు చేయనున్నారు. పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో ఉన్న బికనీర్ జిల్లాలోని నాల్ ఎయిర్ బేస్ వద్ద తేజస్ మార్క్ 1ఏ ఫైటర్ జెట్స్‌ను మోహరించాలని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) యోచిస్తున్నది.
జైపూర్: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా అభివృద్ధి చేస్తున్న తేజస్ ఎల్సీఏ మార్క్ 1ఏ తొలి ఫైటర్ స్క్వాడ్రన్‌ను (Tejas Mark 1A Fighter Squadron) రాజస్థాన్‌లో ఏర్పాటు చేయనున్నారు. పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో ఉన్న బికనీర్ జిల్లాలోని నాల్ ఎయిర్ బేస్ వద్ద తేజస్ మార్క్ 1ఏ ఫైటర్ జెట్స్‌ను మోహరించాలని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) యోచిస్తున్నది. ఎల్సీఏ మార్క్1 తేజస్ యుద్ధ విమానాల కంటే ఎల్సీఏ మార్క్1ఏ ఫైటర్స్ జెట్స్ చాలా అధునాతన సాంకేతికత, సరికొత్త స్వదేశీ రాడార్లు, ఏవియానిక్స్‌తో కూడి ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని నాల్ ఎయిర్ బేస్‌లో ప్రస్తుతం ఉన్న రెండు మిగ్-21 బైసన్ స్క్వాడ్రన్లలో ఒకదానిని తేజస్ మార్క్ 1ఏ ఫైటర్ జెట్స్తో భర్తీ చేయనున్నట్లు వెల్లడించాయి.
కాగా, ఎల్సీఏ మార్క్1ఏ ఫైటర్ జెట్స్‌ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తునట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. తొలి ఎల్సీఏ మార్క్1ఏ ఫైటర్ జెట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య భారత వైమానిక దళానికి సరఫరా అవుతుందని చెప్పారు. ఇప్పటికే 83 ఫైటర్ జెట్స్ ఉత్పత్తిలో ఉన్నాయని, మరో 97 విమానాల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్లు వెల్లడించారు. 40 ఎల్సీఏ మార్క్ 1 తేజస్ యుద్ధ విమానాలతో పాటు, మొత్తం 220 ఎల్సీఏ మార్క్ 1, ఎల్సీఏ మార్క్1 ఏ ఫైటర్ జెట్స్‌ను రానున్న 8 నుంచి పదేళ్లలో వినియోగంలోకి తీసుకువచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. దీంతో పాతకాలం నాటి మిగ్ సిరీస్ యుద్ధ విమానాలను తేజస్ ఫైటర్ జెట్స్తో ఐఏఎఫ్ భర్తీ చేస్తుందని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

