పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) తనదైన చేష్టలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధాని మోదీ చేతి వేలిని ఆయన పట్టుకున్నారు. మోదీ చూపుడు వేలిపై చెరగని ఓటు సిరాను తనిఖీ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజ్‌గిర్‌లోని నలంద యూనివర్శిటీలో కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. ప్రధాని మోదీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, నలంద యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద్ పనగారియా సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంతలో సీఎం నితీశ్ కుమార్ ఉన్నట్టుండి ప్రధాని మోదీ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నారు. మోదీ చూపుడు వేలిపై చెరగని ఓటు సిరాను పరిశీలించారు. ఓటు వేసినప్పటి సిరా మార్క్‌గా మోదీ తెలిపారు. అయితే ఊహించని ఈ సంఘటన పట్ల ప్రధాని మోదీతోపాటు ఆయన వెనుక కూర్చొన్న భద్రతా సిబ్బంది షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
VIDEO | #Bihar CM Nitish Kumar checks PM Modi's finger for indelible ink mark during the inauguration event of new campus of #NalandaUniversity in Rajgir.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/uBkthqzxMm
— Press Trust of India (@PTI_News) June 19, 2024