న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు వెళ్లి వచ్చిన ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లాతో ప్రధాని మోదీ(PM Modi) మాట్లాడారు. ఢిల్లీలో ఆ ఇద్దరూ పలు అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకున్నారు. యాక్సియం-4 స్పేస్ మిషన్‌కు గ్రూప్ కెప్టెన్ శుక్లా .. పైలెట్‌గా చేశారు. సోమవారం ఆ ఇద్దరూ కాసేపు ముచ్చటించారు. ఆ భేటీకి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. అంతరిక్షంలో వాతావరణం భిన్నంగా ఉంటుందని, అక్కడ గురుత్వాకర్షణ ఉండదని శుక్లా అన్నారు. స్పేస్ స్టేషన్లో ఫుడ్ చాలా పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. అక్కడ చాలా తక్కువ స్థలం ఉంటుందని, దాని వల్ల కార్గో చాలా ఖరీదుగా మారుతుందని శుక్లా చెప్పారు. మనకు కావాల్సిన ఆహారాన్ని టైట్‌గా ప్యాక్ చేస్తామని, ప్రయోగాలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటయాన్నారు. నేను ఎక్కడికి వెళ్లినా, అక్కడ అందరూ సంతోషంగా ఉన్నారని, అంతరిక్ష రంగంలో భారత్ మెరుగైన ప్రదర్శన ఇస్తుందన్న విషయం అందరికీ తెలుసు అని శుక్లా అన్నారు.
గగన్‌యాన్ ప్రాజెక్టు గురించి ఎంతో మంది ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఎప్పుడు ఆ మిషన్ జరుగుతుందని ప్రశ్నిస్తున్నారని శుక్లా తెలిపారు. ఎయిర్ ఫోర్స్‌లో తాను చేరినప్పుడు, ఇక తాను చదివేది ఏమీలేదనుకున్నానని, కానీ ఆ తర్వాత చాలా చదువాల్సి వస్తోందన్నారు. టెస్ట్ పైలెట్‌గా మారిన తర్వాత ఈ మిషన్ కోసం ప్రిపేర్ కావాల్సి వచ్చిందన్నారు. తాము వెళ్లిన మిషన్ సక్సెస్ అయ్యిందని, అంత మాత్రాన మిషన్ పూర్తి అయినట్లు కాదు అని శుక్లా తెలిపారు.
శుక్లాతో మాట్లాడిన మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యోమగాముల బృందాన్ని తయారు చేయాలన్నారు. సుమారు 40 నుంచి 50 మంది వ్యోమగాముల బృందాన్ని సంకల్పిస్తున్నట్లు చెప్పారు. తాను బాల్యంలో ఉన్నప్పుడు రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారని, అప్పుడు ఆస్ట్రోనాట్ కావాలన్న ఆలోచన తనకు కలగలేదని శుక్లా అన్నారు. కానీ స్పేస్ స్టేషన్‌కు వెళ్లి వచ్చిన తర్వాత స్కూల్ పిల్లలతో మూడుసార్లు మాట్లాడానని, ప్రతి ప్రోగ్రామ్‌లో ఎలా తాను ఆస్ట్రోనాట్ కావాలని పిల్లలు అడిగినట్లు శుక్లా చెప్పారు. ఇదే మన దేశానికి పెద్ద సక్సెస్‌గా భావించవచ్చు అన్నారు. ఇప్పుడు ఇది సాధ్యమే అని ఇండియాలో తెలుసు అని, మనకు ఆప్షన్ ఉందని, ఆస్ట్రోనాట్ కావచ్చు అని పిల్లలు అనుకుంటారన్నారు. వీలైనంత మందిని తన స్థాయికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని శుక్లా తెలిపారు.
స్పేస్ స్టేషన్, గగన్‌యాన్.. ఈ రెండూ అతిపెద్ద ప్రాజెక్టులు అని, వీటి ఏర్పాట్లలో నీ అనుభవం ఉపయుక్తంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు.
#WATCH | Delhi: During his interaction with Group Captain Shubhanshu Shukla, PM Narendra Modi, said, “…The biggest work would be that we should have a very big pool of astronauts, 40-50 people.”
Group Captain Shubhanshu Shukla said, “When I was young, Rakesh Sharma sir went… pic.twitter.com/c5k34hXwc1
— ANI (@ANI) August 19, 2025