Rajnath Singh | రాజ్‌నాథ్ సభలో నిరసన.. ఆర్మీలో నియామకాల కోసం నిరసన
Rajnath Singh | శనివారం యూపీలో జరిగిన ఎన్నికల సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఉద్యోగ నియామకాలపై నిరసన ఎదురైంది.
Rajnath Singh | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సభలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరిగిన సభలో మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడేందుకు మైక్ దగ్గరకు రాగానే నిశ్శబ్ధంగా ఉన్న కొందరు వ్యక్తులు ఒక్కసారిగా నిరసనకు దిగారు. ఆర్మీలో నియామకాలు చేపట్టాలని నినాదాలు చేశారు. ‘ఆర్మీలో నియామకాలు చేపట్టండి. మా డిమాండ్లు నెరవేర్చండి’ అని నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి కొద్దిసేపు ఆందోళనకరంగా మారింది.
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. నియామకాలు చేపడతామని చింతించొద్దని హామీ ఇచ్చారు. ‘మీ బాధలు మా బాధలే. కరోనా వైరస్ వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. చింతించొద్దు అన్నీ జరుగుతాయి’ అని పేర్కొన్నారు. రాజ్‌నాథ్ సింగ్ హామీతో శాంతించిన నిరుద్యోగులు ‘భారత్ మాతాకీ జై’ అని నినదించారు. దీంతో అక్కడి పరిస్థితులు సద్దుమణిగాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

