న్యూఢిల్లీ: ఈ ఏడాది మేలో కన్నుమూసిన ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ నార్లీకర్ శనివారం విజ్ఞాన్ రత్న పురస్కార్‌కు ఎంపికయ్యారు. విశ్వం ఆవిర్భావంపై బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతాన్ని నార్లీకర్ సవాలు చేశారు. ఈ విశ్వం మనుగడలోనే ఎప్పుడూ ఉందని బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్ హోయ్లేతో కలసి నార్లీకర్ ప్రతిపాదించారు.
ఈ ఏడాది మే 20న తన 86వ ఏట నార్లీకర్ మరణించారు. పద్మ అవార్డుల తరహాలో వైజ్ఞానిక శాస్త్రంలో దేశంలో అత్యున్నత పురస్కారంగా రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాన్ని ప్రభుత్వం అందచేస్తోంది.