మియాపూర్, జులై 12 : కామాక్షి బ్రాహ్మణ సంఘం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సె్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిజాంపేట్ రోడ్ లోని ఆ సంఘ కార్యాలయంలో శనివారం జ్యోతిష్య మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ శశిరాజ్ మెహతా మాట్లాడుతూ జ్యోతిష్యం ప్రాచీన సంస్కృతని, విశ్వవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. దీన్ని కాపాడుకుంటూ ముందు తరాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వేల సంవత్సరాల కిందటే జ్యోతిష శాస్త్రం కనుగొన్నారని, సమాజ ఉపయోగకర ఎన్నో అంశాలకు ఇది పరిష్కారాన్ని చూపినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా 12 మంది జ్యోతిష్య శాస్త్ర నిపుణుల బృందం ప్రజల సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలను, విలువైన సూచనలు ఇచ్చింది. కార్యక్రమంలో డాక్టర్ మారేపల్లి భువనేశ్వరి, సంఘ ప్రతినిధులు నరసింహారావు, సుధాకర్, మాణిక్యాలరావు మహిళా విభాగం ప్రతినిధులు రమణి, కళ్యాణి, దుర్గాభవాని, జయశ్రీ, కుమారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులను ఘనంగా సన్మానించారు.