Himanta Biswa Sarma | మంత్రులు, ప్రభుత్వ అధికారులకు విద్యుత్ రాయితీ ఇవ్వబోం: అస్సాం సీఎం
Himanta Biswa Sarma | మంత్రులు, ప్రభుత్వ అధికారులకు విద్యుత్ రాయితీ ఇవ్వబోమని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఇకపై మంత్రులు, ప్రభుత్వ అధికారుల క్వాటర్స్‌కు ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
గౌహతి: మంత్రులు, ప్రభుత్వ అధికారులకు విద్యుత్ రాయితీ ఇవ్వబోమని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) తెలిపారు. ఇకపై మంత్రులు, ప్రభుత్వ అధికారుల క్వాటర్స్‌కు ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తద్వారా వారి జీతాల నుంచి సంబంధిత విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తామని వెల్లడించారు. ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అస్సాంలో ఇకపై ఏ మంత్రి, అధికారి లేదా ప్రభుత్వ ఉద్యోగికి విద్యుత్ రాయితీ ఇవ్వబోమని పేర్కొన్నారు.
కాగా, మినిస్టర్స్ క్వాటర్స్, కాలనీలు, నివాసాలతో పాటు ప్రభుత్వ క్వార్టర్లలో ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని విద్యుత్ శాఖను ఆదేశించినట్లు సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రులు, సీనియర్ అధికారుల జీతాల నుంచి నెలవారీ విద్యుత్ బిల్లు ఛార్జీలను నామమాత్రంగా మినహాయిస్తామని వెల్లడించారు. ఇటీవల విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు.
During my recent interactions with officials from the Power Department, I was informed for the first time that a very nominal monthly power bill is deducted from the salaries of ministers and senior officers. Immediately, I instructed the department to install individual prepaid…
— Himanta Biswa Sarma (@himantabiswa) February 11, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TOMCOM | టామ్‌కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్‌లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

