దిస్పూర్ : అసోంలో ఓ మదర్సాను అక్కడి ప్రభుత్వం కూల్చివేసింది. ఈ మదర్సా కూల్చివేతకు కారణం బంగ్లాదేశ్‌కు చెందిన తీవ్రవాద గ్రూపుతో సంబంధాలు కలిగి ఉండటమే అని అధికారులు సెలవిస్తున్నారు. ఇటీవల ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత అసోంలోని బొంగైగావ్‌లో ఉన్న మదర్సాకు ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాతో సంబంధాలు ఉన్నట్లుగా ధృవీకరించుకున్నారు. దాంతో మంగళవారం రాత్రి ఆ మదర్సా భవంతిని బుల్డోజర్తో కూల్చివేయించారు. బుధవారం ఉదయం వరకు భవనం కూల్చివేత పనులు కొనసాగాయి.
మదర్సా భవనాలు ఏపీడబ్ల్యూడీ స్పెసిఫికేషన్స్ / ఐఎస్ నిబంధనల ప్రకారం నిర్మించలేదని, మదర్సా నిర్మాణాత్మకంగా మనుషుల నివాసానికి సురక్షితం కాదని జిల్లా యంత్రాంగం ఒక ఆర్డర్లో పేర్కొన్నట్లు ఎస్పీ స్వప్ననీల్ దేకా పేర్కొన్నారు. అయితే, గోల్పరా జిల్లా పోలీసులు ఏక్యూఐఎస్/ఏబీటీతో సంబంధం కలిగివుండి అరెస్టయిన వ్యక్తితో ఈ మదర్సాలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆఘమేఘాల మీద జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు మదర్సాను కూల్చివేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ఎస్పీ స్వప్ననీల్ దేకా తెలిపారు. అల్-ఖైదాతో సంబంధాలు కలిగి ఉన్న విషయాన్ని విచారిస్తున్న పోలీసులు వెల్లడించాలని చెప్పారు.
ఒక్క అసోంలోనే కూల్చివేతకు గురైన మదర్సా భవంతుల్లో ఇది మూడోది కావడం విశేషం. ఇప్పటివరకు అల్-ఖైదాతో సంబంధాలు కలిగి ఉన్న ఆరోపణలతో 37 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అరెస్టైన వారిలో ఇమామ్‌తోపాటు మదర్సా టీచర్లు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, ఉగ్రవాద సంస్థతో బొంగైగావ్ మదర్సాకు లింకులు ఉన్న విషయం తనకు తెలియదని ఎస్సీ స్వప్ననీల్ దేకా చెప్పడం విశేషం.
#WATCH | Assam: Markazul Ma-Arif Quariayana Madrasa, located at Kabaitary Part-IV village in Bongaigaon district, being demolished
This is the 3rd Madrasa demolished by the Assam government following arrests of 37 persons including Imam and Madrasa teachers linked with AQIS/ABT pic.twitter.com/zTQiiicAne
— ANI (@ANI) August 31, 2022