CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
CM's Vigilance Cell Officer | ముఖ్యమంత్రి విజిలెన్స్ సెల్‌కు చెందిన పోలీస్ అధికారి హోటల్ రూమ్‌లో మరణించారు. ఒక హోటల్లో బస చేసిన ఆయన రూమ్ నుంచి బయటకు రాకపోవడం, ఆ గది నుంచి వాసన రావడాన్ని హోటల్ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గువాహటి: ముఖ్యమంత్రి విజిలెన్స్ సెల్‌కు చెందిన పోలీస్ అధికారి హోటల్ రూమ్‌లో మరణించారు. ఒక హోటల్లో బస చేసిన ఆయన రూమ్ నుంచి బయటకు రాకపోవడం, ఆ గది నుంచి వాసన రావడాన్ని హోటల్ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. (CM’s Vigilance Cell Officer) అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కార్యాలయంలోని విజిలెన్స్ సెల్‌కు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఖర్గేశ్వర్ రాభా, అక్టోబర్ 18న బోంగైగావ్లోని హోటల్ జాహ్నవి రీజెన్సీలో బస చేశారు. అయితే చాలా సమయం పాటు రూమ్ నుంచి ఆయన బయటకు రాలేదు. అలాగే ఆ గది నుంచి వాసన రావడాన్ని హోటల్ సిబ్బంది గమనించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, సీనియర్ పోలీస్ అధికారులు ఆ హోటల్‌కు చేరుకున్నారు. రూమ్ డోర్‌ను బలవంతంగా తెరిచి లోపలకు వెళ్లి చూశారు. కొంత కుళ్ళిన స్థితిలో ఉన్న డీఎస్పీ ఖర్గేశ్వర్ రాభా మృతదేహాన్ని గుర్తించారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. ఆ పోలీస్ అధికారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు అస్సాం సీఎం విజిలెన్స్ సెల్‌కు చెందిన డీఎస్పీ ఖర్గేశ్వర్ రాభా, అనారోగ్యం కారణంగా ఆ హోటల్ రూమ్‌లో మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆయన ఆ హోటల్లో బస చేసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. సందర్శకుల వివరాలు, కాల్స్ సమాచారంతో పాటు సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదికతో పాటు మరిన్ని వివరాలు అందిన తర్వాత సీఎం విజిలెన్స్ సెల్ అధికారి మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

