గౌహతి: ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన బీజేపీ నేత (BJP Leader) ఒక్కసారిగా మాట్లాడటం ఆపేశారు. మసీదు నుంచి ప్రార్థన వినగానే ఆయన మౌనంగా ఉండిపోయారు. అది ముగిసిన తర్వాత తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలోని చిరాంగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కోక్రాజార్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి జయంత్ బసుమతరీ తరపున ఆ పార్టీ నాయకుడు పీయూష్ హజారికా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా సమీపంలోని మసీదు నుంచి ప్రార్థన వినిపించింది. దీంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. మసీదులో ప్రార్థన ముగిసే వరకు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు.
కాగా, తన చర్యపై పీయూష్ హజారికా వివరణ ఇచ్చారు. మతపరమైన మనోభావాలకు భంగం కలుగకూడదన్న ఉద్దేశంతో ప్రసంగానికి విరామం ఇచ్చినట్లు తెలిపారు. అన్ని మతాలను గౌరవించాలని, ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించాలని ఆయన అన్నారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీజేపీ నేత చర్యపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. మత సామరస్యాన్ని ఆయన చాటడాన్ని పలువురు ప్రశంసించారు. అయితే ఎన్నికల వేళ రాజకీయ జిమ్మిక్కుగా కొందరు విమర్శించారు.
#WATCH | Assam Minister Pijush Hazarika pauses his speech as 'Azaan' plays out from a nearby Mosque, during an election campaign.
(Source: Pijush Hazarika's Office) pic.twitter.com/0Sb5Pb4Z9v
— ANI (@ANI) May 1, 2024