గౌహతి: అస్సాం, నాగాలాండ్ గవర్నర్ జగదీష్ ముఖీకి కరోనా సోకింది. కరోనా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో గౌహతిలోని అపోలో ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. కాగా, గవర్నర్ జగదీష్ ముఖీ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
కాగా, అస్సాంలో గురువారం కొత్తగా 9 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. బుధవారం కొత్తగా 3,274 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు నాగాలాండ్‌లో బుధవారం కొత్తగా 199 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే గత 24 గంటల్లో ఎలాంటి ఒమిక్రాన్ కేసులు నమోదుకాలేదని ఆ రాష్ట్ర వైద్య అధికారులు తెలిపారు.