కోజికోడ్, మార్చి 5: మలయాళం వార్తా చానెల్ ఆసియానెట్ కార్యాలయంలో కేరళ పోలీసులు ఆదివారం సోదాలు చేశారు. ఓ ఇంటర్వ్యూకు సంబంధించి నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు చేశామని, ఎలాంటి దస్ర్తాలు స్వాధీనం చేసుకోలేదని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
మాదక ద్రవ్యాల కొరియర్‌గా పని చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక పాఠశాల విద్యార్థినిని ఆసియానెట్ చానెల్ ఇంటర్వ్యూ చేసిందని, అది తప్పుడు వార్త అని ఒక రాజకీయ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చానెల్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఇంటర్వ్యూ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాలక పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఈ నెల 3న చానెల్ కార్యాలయంలోకి చొరబడి సిబ్బందిని బెదిరించారు.