న్యూఢిల్లీ: పిల్లల్లో ఆటిజం(మందబుద్ధి), హైపరాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్డీ)కు ‘బీపీఏ’ ప్లాస్టిక్కు సంబంధముందని తాజా అధ్యయనం తేల్చింది. రోవాన్ వర్చు స్కూల్, రట్గర్స్ వర్సిటీ, న్యూజెర్సీ మెడికల్ స్కూల్ సైంటిస్టులు ఈ మేరకు తెలిపారు.
బీపీఏ ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్లాక, సాధారణంగా మిగతా పిల్లల్లో మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు పోతున్నది. కానీ ఏడీహెచ్డీ, ఆటిజం బాధిత పిల్లల్లో ఈ సామర్థ్యం తక్కువగా ఉందని, దీంతో అవి శరీరాల్లోనే ఉండిపోతున్నాయని గుర్తించారు.