న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అశోకా యూనివర్సిటీ(Ashoka University) అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మెహమూదాబాద్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతను తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ అతని పిటీషన్‌ను సుప్రీంలో వాదించనున్నారు. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ బెంచ్ ముందుకు ఆ పిటీషన్ వెళ్లింది. మంగళవారం లేదా బుధవారం ఆ పిటీషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు సీజేఐ తెలిపారు. ఆదివారం ప్రొఫెసర్ అలీ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. హర్యానా రాష్ట్ర మహిళా కమీషన్ కూడా ఆ ప్రొఫెసర్‌కు నోటీసులు ఇచ్చింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నట్లు మహబూదాబాద్ పేర్కొన్నారు.