సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు
డీలిమిటేషన్ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టంచేశారు.
- డీలిమిటేషన్ బిల్లుపై పార్లమెంట్లో ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్
న్యూఢిల్లీ: డీలిమిటేషన్ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టంచేశారు. డీలిమిటేషన్ బిల్లుపై గురువారం పార్లమెంట్లో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రజాస్వామ్యం, ఫెడరలిజానికి ఈ బిల్లు పూర్తి విరుద్ధమని మండిపడ్డారు. డీలిమిటేషన్ ఫ్రీజ్ను తొలగించడం ద్వారా తక్కువ జనాభా ఉన్న రాష్ర్టాలకు దక్కాల్సిన న్యాయమైన వాటాను ఈ బిల్లు కాలరాస్తున్నదని దుయ్యబట్టారు. దక్షిణాది రాష్ర్టాలను ఎప్పటికీ ఇతర రాష్ర్టాలే పరిపాలించాలనే కుట్ర ఈ బిల్లు వెనుక దాగి ఉన్నదని విమర్శించారు.
చట్టసభల్లో ఓబీసీ, ముస్లింల ప్రాతినిధ్యాన్ని తగ్గించేలా బిల్లు ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ, శాసనసభల్లో సీట్లు పెంచితే ఎక్కువ జనాభా ఉన్న రాష్ర్టాలకే మరిన్ని అధికారాలు ఇచ్చినట్టు కాదా? అని ప్రశ్నించారు. చిన్న రాష్ర్టాలు తమ గొంతు వినిపించే హక్కు కోల్పోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. హిందీ మాట్లాడే రాష్ర్టాలకు ఇప్పటికే 38.1% ప్రాతినిధ్యం ఉండగా.. డీలిమిటేషన్తో 43.1 శాతానికి చేరుతుంది. దక్షిణాది రాష్ర్టాలకు 24% ఉన్న ప్రాతినిధ్యం 20 శాతానికి పడిపోతుందని వివరించారు. ‘బిల్లు ప్రవేశపెట్టడానికి ఏడు రోజుల ముందు సభ్యులకు కేంద్ర మంత్రి నోటీసులు ఇవ్వాలి. బిల్లు కాపీలను రెండు రోజుల ముందు ఇవ్వాలి. ఈ విషయంలో ఆర్పీఏ 1951లోని 123 బీ నిబంధనలను కేంద్రం ఉల్లంఘించింది’ అని ఒవైసీ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

